తూర్పూ పడమర ఎదురెదురూ పాట లిరిక్స్ | తూర్పు పడమర (1976)

 చిత్రం : తూర్పు పడమర (1976)

సంగీతం : రమేశ్ నాయుడు

సాహిత్యం : సినారె

గానం : సుశీల, శైలజ


తూర్పూ పడమర ఎదురెదురూ..నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ?.. ఈ సృష్టికి  మొదలేదీ? 


తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ . . ఈ సృష్టికి మొదలేదీ


తూర్పున ఉదయించే సూర్యుడు.. పడమట నిదురించునూ

పడమట నిదురించే సూర్యుడే.. తూర్పున ఉదయించునూ

ఆ తూర్పు పడమరకేమౌనూ.. ఈ పడమర తూర్పునకేమౌనూ

ఈ ప్రశ్నకి బదులేదీ?..  ఈ సృష్టికి మొదలేదీ


తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ.. ఈ సృష్టికి మొదలేదీ


నింగిని సాగే నీలి మేఘం నేల వడిలో వర్షించునూ

నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించునూ

ఆ నింగికి నేల ఏమౌనూ? ఈ నేలకు నింగి ఏమౌనూ

ఈ ప్రశ్నకి బదులేదీ? ఈ సృష్టికి మొదలేదీ?


తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ

కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ

ఈ ప్రశ్నకి బదులేదీ.. ఈ సృష్టికి మొదలేదీ


వేయని నాటకరంగం పైనా రాయని నాటకమాడుతున్నానూ

సూత్రధారికి పాత్రధారులకు తేడా తెలియక తిరుగుతున్నామూ

నాటకమే ఒక జీవితమా? జీవితమే ఒక నాటకమా

ఈ ప్రశ్నకు... ఈ ప్రశ్నకు..


జీవితమే ఒక నాటకమైతే... నాటకమే ఒక జీవితమైతే

పాత్రలు ఎక్కడ తిరిగినా.. సూత్రధారి ఎటు తిప్పినా

కథ ముగిసేలోగా కలవకుందునా..

ఆ సూత్రధారి తానే కలపకుండునా


విన్నావా ఇది విన్నావా... సూర్యుడా.. ఉదయ సూర్యుడా...

పడమటి దిక్కున ఉదయించాలని బ్రాంతి ఎందుకో?

సృష్టికే ప్రతి సృష్టి చేయు నీ దృష్టి మానుకో

నిన్ను ఆశగా చూసే కనులకు..

కన్నీరే మిగిలించకూ...  ఇంకా ఇంకా రగిలించకూ

చంద్రుని చలువలు పంచుకో.. నిన్నటి ఆశలు తెంచుకో


తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ


కోటి వీణియలు గుండె అంచులను మీటినావా దేవా 

కొండవిడిచి ఆ కోనవిడిచి కైదండనొసగి కాపాడవా..

ఇక ఆడలేను ఈ నాటకం.. అలసిపొయె నా జీవితం 

రావయ్యా.. దిగి రావయ్యా.. ఇదే ఇదే నా మంగళగీతం 

ఒక సుమంగళీ గీతం ఒక సుమంగళీ గీతం..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)