చిత్రం : కిరాయి రౌడీలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ..
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. హా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
కొండలెన్నో ఎక్కావా... కోనలెన్నో దాటావా
కోరుకొండా ఎక్కాను... గోలుకొండా కొట్టాను
ఎక్కలేకా పడ్డావా... దాటలేక జారావా
ఎన్ని తిప్పలు పడ్డానో... ఏమి చెప్పను బుల్లమ్మో
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఓ కోడె వయసా... ఓ కొంటె మనసా
ఆడదంటే అలుసా... కాదే కులాసా
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
సై అంటే సై అంటావా సయ్యాటలో..
ఓ కొంటె కోణంగి... సరసాల సంపంగి
డడడడడడ డడ్డడడా...
డడడడడడ డడ్డడడా...
రెప్ప కొట్టే చూపుందా.. రెచ్చగొట్టే రూపుందా
హా.. కోరికంటి మనసుంది... కోరుకున్న కైపుంది
తోడు లేని ఈడుందా.. తోడుబెట్టామంటుందా
పాలు పొంగే ఈడుంది... పాలు పంచే పదునుంది
ఓ లేత వయసా... నేనంటే మనసా
ఓ..హో..హో.. లేత వయసా... అ..అ..ఆ.. నేనంటే మనసా
అరెరెరే.. వరించాను తెలుసా... అదే నా బరోసా
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి
సై అంటే సై అంటాలే.. సయ్యాటలో
ఓ కొంటె కోణంగి... సరదాల సారంగి... ఈ..ఈ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon