జాబిలితో చెప్పనా పాట లిరిక్స్ | వేటగాడు (1979)

 చిత్రం : వేటగాడు (1979)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, సుశీల 


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..

జామురాతిరి నిదురలోన

నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..

జామురాతిరి కలలలోన

నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


తుమ్మెదలంటని తేనెలకై.. తుంటరి పెదవికి దాహాలు

చుక్కలు చూడని చీకటిలో.. సిగ్గులు కలవని విరహాలు

తుమ్మెదలంటని తేనెలకై.. తుంటరి పెదవికి దాహాలు

చుక్కలు చూడని చీకటిలో.. సిగ్గులు కలవని విరహాలు

చూపులలో చలి చురచురలూ.. ఆ చలి తీరని విరవిరలూ

అన్నీ ఆవిరి పెడుతుంటే.. నన్నే అల్లరి పెడుతున్నావని

చెప్పనా .. ఆ .. చెప్పనా.. ఆ .. చెప్పనా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..

జామురాతిరి నిదురలోన

నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..

జామురాతిరి కలలలోన

నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


గొంతులు దాచిన గుండెలలో.. కోయిల పాడని గీతాలు

సూర్యుడు చూడని గంగలలో.. అలలై పొంగిన అందాలు

గొంతులు దాచిన గుండెలలో.. కోయిల పాడని గీతాలు

సూర్యుడు చూడని గంగలలో.. అలలై పొంగిన అందాలు

కౌగిట కాముని పున్నములు.. వెన్నెల వీణల సరిగమలు

పేరంటానికి రమ్మంటే.. పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని

చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా

జామురాతిరి కలలలోన

నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా

జామురాతిరి నిదురలోన

నీవు చేసిన అల్లరి చెప్పనా.. రోజా


రోజా.. రాజా.. రోజా.. రాజా

రోజా.. రాజా.. రోజా.. రాజా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)