చిత్రం : ధర్మయుద్ధం (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, జానకి
నీ కన్నులలోనా మురిసే మదిలోన
కురిసే విరివాన మల్లెల రాశీ పల్లవి చేసీ
పలికెనే పరవశం కలిగెనే సంగమం
ఊహలు రేగే రాగాలను రేపే
నీగాధలూ తెల్పే అల్లరిచేసే ఆశలు కలిసే
బంధమే పరవశం అందమే సంగమం
కదలి ఆడే హే.హే.. మౌన రాగం.. ఓఓఓ
కదలి ఆడే హే.హే.. మౌన రాగం.. ఆఆఆ
కలలుగా విరిసెనే మదిలో మధుమాసం
మనసెందుకో ఓఓఓ పులకించేనే
మధువులు చిలికేనే పరువం ఓ చెలిమి
మృధుమధురం ఈ సమయం
నీ చెంత ఇది స్వర్గమో
ఊహలు రేగే రాగాలను రేపే
నీగాధలూ తెల్పే మల్లెల రాశీ పల్లవి చేసీ
పలికెనే పరవశం కలిగెనే సంగమం
జీవితాంతం.. హేహేహే.. సాగిపోదాం.. ఓఓఓ
జీవితాంతం.. హేహేహే.. సాగిపోదాం.. ఓఓఓ
తోడుగా నీడగా జతగా మన స్నేహం
చెలిగుండెలో ఓఓఓ.. ఈ వేళలో
తలపులు విరియాలి మనసే నిండాలి
అలలాగా నా మదిలో చెలరేగే తొలిమోహం
నీ కన్నులలోనా మురిసే మదిలోన
కురిసే విరివాన అల్లరిచేసే ఆశలు కలిసే
బంధమే పరవశం అందమే సంగమం
లలలల లాలాల లాలలా లాలలా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon