నువ్వేలే నువ్వేలే పాట లిరిక్స్ | జయజానకీనాయకా (2017)


చిత్రం : జయజానకీనాయకా (2017)

సంగీతం : దేవీశ్రీప్రసాద్

సాహిత్యం : చంద్రబోస్

గానం : శ్వేతా మోహన్


నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే 


నడవలేని చోటులోన

పూల బాట నువ్వేలే

నిదురలేని జీవితాన

జోల పాట నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం 

నువ్వేలే

 

మేఘాలెన్నున్నా ఆకాశం నువ్వేలే

రాగాలెన్నున్నా అనురాగం నువ్వేలే

బంధాలెన్నున్నా ఆనందం నువ్వేలే

కష్టాలెన్నున్నా అదృష్టం నువ్వేలే

అలసి ఉన్న గొంతులోన

మనసు మాట నువ్వేలే

అడవిలాంటి గుండెలోన

తులసికోట నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే

నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే

 

దైవాలెన్నున్నా నా ధైర్యం నువ్వేలే

స్వర్గాలెన్నున్నా నా సొంతం నువ్వేలే

దీపాలెన్నున్నా నా కిరణం నువ్వేలే

ఆభరణాలెన్నున్నా నా తిలకం మాత్రం నువ్వేలే

మధురమైన భాషలోన

మొదటి ప్రేమ నువ్వేలే

మరణమైన ఆశలోన

మరొక జన్మ నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా ప్రాణం నువ్వేలే

కన్నీళ్ళకు నవ్వులు నేర్పిన

నేస్తం నువ్వేలే


నువ్వేలే నువ్వేలే

నా లోకం నువ్వేలే

చీకట్లకు రంగులు పూసిన

స్నేహం నువ్వేలే 

 


Share This :



sentiment_satisfied Emoticon