బుగ్గ చుక్క పెట్టుకుంది పాట లిరిక్స్ | రారండోయ్ వేడుక చూద్దాం (2017)


చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం (2017)

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

గానం : రంజిత్, గోపికా పూర్ణిమ


బుగ్గ చుక్క పెట్టుకుంది

సీతమ్మా సీతమ్మా

కంటి నిండా ఆశలతో

మా సీతమ్మా


తాళిబొట్టు చేతబట్టి

రామయ్యా రామయ్యా

సీత చెయ్యి పట్ట వచ్చే

మా రామయ్యా


పెద్దలు వేసిన అక్షింతలు

దేవుడు పంపిన దీవెనలు

దివిలో కుదిరిన దంపతులు

ఈ చోట కలిసారు ఇవ్వాల్టికి


ఆటలు పాటలు వేడుకలు

మాటకు మాటలు అల్లరులు

తియ్యని గుర్తుల కానుకలు

వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్లకి


రారండోయ్ వేడుక చూద్దాం

ఈ సీతమ్మని రామయ్యని

ఒకటిగా చేసేద్దాం

ఆడేద్దాం / పాడేద్దాం / నవ్వేద్దాం

ఆఆఆ నవ్వేద్దాం


వారు వీరనే తేడా లేదులే

ఇకపై ఒక్కటే పరివారం

పేరు పేరునా పిలిచే వరుసలై

ఎదిగే ప్రేమలే గుణకారం

ఇద్దరి కూడిక కాదు ఇది

వందల మనసుల కలయికిది

ఈ సుముహూర్తమే వారధిగా

భూగోళమే చిన్నదవుతున్నది


రారండోయ్ వేడుక చూద్దాం

వేదమంత్రాలతో ఈ జంటని

ఆలుమగలందాం

ఆడేద్దాం / పాడేద్దాం/ నవ్వేద్దాం

ఆఆఆ నవ్వేద్దాం


కాలం కొమ్మపై మెరిసే నవ్వులై

కలిసే గువ్వలే బంధువులు

కదిలే దారిలో మెదిలో గుర్తులై

నడిపే దివ్వెలే వేడుకలు

ఎప్పుడో తెలిసిన చుట్టాలు

ఇప్పుడే కలిసిన స్నేహితులు

మనసును తడిమిన సంగతులు

కనువిందుగా ఉంది ఈ పందిరి


రారండోయ్ వేడుక చూద్దాం

అయిన వాళ్లందరం ఈ వేలిలా

ఒక్కటిగా చేరాం

ఆడేద్దాం / పాడేద్దాం / నవ్వేద్దాం

ఆఆఆ నవ్వేద్దాం


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)