చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : యస్. జానకి
పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల
నింగిలోన చందమామ తొంగి చూచె
నీటిలోన కలువభామ పొంగి పూచె..
ఈ అనురాగమే జీవనరాగమై
ఈ అనురాగమే జీవనరాగమై
ఎదలో తేనెజల్లు కురిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల
కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసె
మురళి పాట విన్న నాగు శిరసునూపె
ఈ అనుబంధమే మధురానందమై
ఈ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా
పగలే వెన్నెల జగమే ఊయల
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పికము పాడె
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడె
పూల ఋతువు సైగచూచి పికము పాడె
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon