చిత్రం : జీవితంలో వసంతం (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, వాణీ జయరాం
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా... ప్రియతమా ఓ ఓ ఓ
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...
తేలి తేలి పోదామా సోలి సోలి పోదామా
ప్రియతమా... ప్రియతమా
నీలగిరి చల్లన నీ వడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ వడిలో
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం ఓహోఓహో
జీవితంలో వసంతం నీలాల మబ్బులలో...
నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా... తేలి తేలి పోదామా
సోలి సోలిపోదామా... సోలి సోలిపోదామా
ప్రియతమా... ప్రియతమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon