చిత్రం : పాలు నీళ్ళు (1981)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాసరి
గానం : ఆషాభోంస్లే
ఆఆఆఆఅ..ఆఆఆఆఆ...
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం...
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
పట్టపగలు చందమామ పొడిచిన రోజూ
ఆకాశం హరివిల్లై వంగిన రోజూ
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
కడలి పొంగి ఆడిన రోజు
మూగ గొంతు పాడిన రోజు
దొరకక దొరకక...
దొరకక దొరకక దొరికిన రోజు
దొరికీ దొరకక దొరకని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఇది మౌనగీతం ఒక మూగరాగం
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ
వెన్నెలంతా మల్లెలై పూచిన రోజూ
మల్లెలన్నీ తారలై మెరిసిన రోజూ
గుండెబరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
గుండెబరువు మరిచిన రోజు
పాల గుండె పొంగిన రోజు
మిగలక మిగలక
మిగలక మిగలక మిగిలిన రోజు
మిగిలీ మిగలక మిగలని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఒకే ఒక్క రోజు తిరిగిరాని రోజు
ఇది మౌనగీతం ఒక మూగరాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
పాడింది పెల్లుబికి కళ్యాణి రాగం
ఇది మౌనగీతం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon