మెల్ల మెల్ల మెల్లగా పాట లిరిక్స్ | దాగుడు మూతలు (1964)

 చిత్రం : దాగుడు మూతలు (1964)

సంగీతం : కె.వి.మహదేవన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : ఘంటసాల, సుశీల


మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..


నీది కానిదేది లేదు నాలో..

నిజానికి నేనున్నది నీలో..

నీది కానిదేది లేదు నాలో..

నిజానికి నేనున్నది నీలో..

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో..

ఒక్కటే మనసున్నది ఇద్దరిలో..

ఆ ఒక్కటీ చిక్కె నీ గుప్పిటిలో.. హాయ్..


మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెల్ల మెల్ల మెల్లగా..


నిన్ను చూచి నన్ను నేను మరచినాను..

నన్ను దోచుకొమ్మని నిలిచినాను..

నిన్ను చూచి నన్ను నేను మరచినాను..

నన్ను దోచుకొమ్మని నిలిచినాను..

దోచుకుందమనే నేను చూచినాను..

దోచుకుందమనే నేను చూచినాను..

చూచి చూచి  నువ్వె నన్ను దోచినావు!


మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెల్ల మెల్ల మెల్లగా..


కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు..

కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు..

కన్నులకు కట్టినావు ప్రేమ గంతలు..

కన్నె మనసు ఆడినదీ దాగుడు మూతలు..

దొరికినాము చివరకు తోడుదొంగలం..

దొరికినాము చివరకు తోడుదొంగలం..

దొరలమై ఏలుదాము వలపు సీమలూ.. హాయ్..


మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెత్తగ అడిగితే లేదనేది లేదుగా..

మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..

మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)