నమ్మక తప్పని నిజమైన సాంగ్ లిరిక్స్ బొమ్మరిల్లు (2006) తెలుగు సినిమా


Album Bommarillu

Starring:Siddharth Narayan, Genelia D'Souza
Music :Devi Sri Prasad
Lyrics-Sirivennela Seetarama Sastry
Singers :Sagar, Sumangali
Producer:Dil Raju
Director: Bhaskar

Year: 2006






నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేన ఓ ఓ
ఎందరితో కలిసున్నా నెనొంటరిగానే ఉన్నా నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓ ఓ ఓ
కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే ఐనా
ఇప్పటికి ఆ కలలొనే ఉన్నా

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ

ఈ జన్మంతా విడిపోదీ జంట అని దీవించిన గుడిగంటను ఇక నా మది వింటుందా
నా వెను వెంట నువ్వే లేకుండ రోజు చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా వెనుదిరిగిన చెలిమి అలా
తడి కనులతో నిను వెతికేది ఎలా

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరి మల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలి వరమా ఆ

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా ఓ ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపులనొదిలేన ఓ ఓ

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)