సాంబశివు పదములే కదిలే పాట లిరిక్స్ | మధుర మీనాక్షి (1989)

 చిత్రం : మధుర మీనాక్షి (1989)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథం 

సాహిత్యం : రాజశ్రీ 

గానం : బాలమురళీ కృష్ణ 


ఓం నమశ్శివాయ.. 

ఓం నమశ్శివాయ..

ఓం నమశ్శివాయ.. 

సాంబశివు పదములే కదిలే 

దివి కదిలె రవి కదిలె 

పవనుండు తా కదిలె 

నా తల్లి ఉమ కదిలె 

భువనాలు నర్తించెనే 


గిరి దుహిత పరవశగ కదలా 

పరశివు విజృంభణము ప్రభలా 

ముల్లోకములకెల్ల శుభములే విలసిల్ల 


కనుగొంటి శివతాండవం 

కనుగొంటి శివతాండవం


ఓం నమశ్శివాయ.. ఓం

ఓం నమశ్శివాయ.. ఓం

ఓం నమశ్శివాయ.. ఓం

ఓం నమశ్శివాయ.. ఓం


శంభు మహోజ్వల నాట్యానా 

జగదంబ మనోహర లాస్యానా 

శంభు మహోజ్వల నాట్యానా 

జగదంబ మనోహర లాస్యానా 

అధ్బుతమైనది ఈ నటన 

ఇది అభినయ తాండవ అవతరణ 

అభినయ తాండవ అవతరణ 


అధ్బుతమైనది ఈ నటన 

ఇది అభినయ తాండవ అవతరణ 


భక్తుల బ్రోచే హిమగిరి నందిని 

శక్తి స్వరూపిణి త్రిభువన పావని 

పార్వతి మాతా పద విన్యాసం కనుగొంటిని 

సంభ్రమ ఢమరుక శబ్ద తరంగం 

ప్రళయ భయంకర మృత్యు మృదంగం 

రుద్ర మహోధృత పద ఘట్టనము 

కనుగొంటి ఓం శివహోం.. 

శివహోం.. శివహోం

పుణ్యాల పంట ఈ జంట 

ముల్లోకముల గాచునంట 

ఈ నాట్య విన్యాస హేల 

సృష్టికే ఆనంద డోల 


కనుగొంటి శివతాండవం

కనుగొంటి శివతాండవం


హర హర మహాదేవ

హర హర మహాదేవ  


 

Share This :



sentiment_satisfied Emoticon