శ్రీ గౌరీ వాగీశ్వరీ పాట లిరిక్స్ | గడసరి అత్త సొగసరి కోడలు (1981)


చిత్రం : గడసరి అత్త సొగసరి కోడలు (1981)

సంగీతం : సత్యం

సాహిత్యం : వేటూరి

గానం : భానుమతి


శ్రీ గౌరీ వాగీశ్వరీ

శ్రీకార సాకార శృంగార లహరి

శ్రీ గౌరి వాగీశ్వరీ శ్రీ గౌరి వాగీశ్వరీ

శ్రీకార సాకార శృంగార లహరి

శ్రీ గౌరి వాగీశ్వరీ

శ్రీకార సాకార శృంగార లహరి

శ్రీ గౌరి వాగీశ్వరీ


సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే

నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి

సిరులిచ్చి రక్షించు శ్రీలక్ష్మి నీవే

నీ చిత్తమే భాగ్యమే దేవ దేవి

ముంజేతి చిలుక ముద్దాడ పలుకా

దీవించవే మమ్ము మా భారతీ

సకల శుభంకరి విలయ లయంకరి

శంకర చిత్త వశంకరి శంకరి

సౌందర్య లహరి శివానంద లహరీ


శ్రీ గౌరి వాగీశ్వరీ

శ్రీకార సాకార శృంగార లహరి

శ్రీ గౌరి వాగీశ్వరీ

ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి

కల్పవల్లి గౌరి కాపాడవే

ముగ్గురమ్మల గన్న మురిపాల వెల్లి

కల్పవల్లి గౌరి కాపాడవే

మా ఇంట కొలువై మము బ్రోవవే

పసుపు నిగ్గుల తల్లి మా పార్వతీ

ఆగమ రూపిణి అరుణ వినోదిని

అభయమిచ్చి కరుణించవె శంకరి

సౌందర్య లహరి శివానంద లహరీ


శ్రీ గౌరి వాగీశ్వరీ

శ్రీకార సాకార శృంగార లహరి

శ్రీ గౌరి వాగీశ్వరీ  


Share This :



sentiment_satisfied Emoticon