సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా పాట లిరిక్స్ | అశ్వని (1992)



చిత్రం : అశ్వని (1992)

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

సాహిత్యం : వేటూరి

గానం : చిత్ర


సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా

ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా

లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు

దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు

సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా

నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు


సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా

ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా


నా ఫుడ్డు మానేసినా ఈ గుడ్డు తెచ్చానులే

చపాతీ కుర్మాలగా చమటోడ్చీ తెచ్చానులే

బొజ్జనిండ ఆరగించు బుజ్జి అమ్మడు

కండ దండిగుంటె పండగా

పెట్టుకున్న ఆశలన్నీ తీర్చు అమ్మడు

తీర్చకుంటె తిండి దండగా

తారలందు నీవె ఫస్టులే ఆశ్వని


సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా

ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా


త్యాగాలూ నీకోసమే చేసేటీ వారుండగా

ప్రాణాలే నీకోసమే పంచేటీ వారుండగా

బుద్దిలేని బద్దకాలు మాను అమ్మడూ

నిన్న మాట నిండు సున్నగా

ఆకసాన సంతకాలు చెయ్యి ఇప్పుడూ

నింగి దాక వేసి నిచ్చెనా

రామబాణమల్లె సాగవే ఆశ్వనీ


సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా

ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా


లోని వెలుగు చూడరా పైని మెరుగు కాదు

దారి మలుపు తిప్పరా గెలుపు నీది నేడు

సవాలు గుర్రముందిరా సవారి చేసి చూడరా

నిరాశ నీకు చేటు ఆశయాల చేక్కు పోస్టు నీకు రూటు


సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టి రాయిరా

ఆనకట్ట కట్టులేని ఏటికైనా చరిత్ర లేదురా 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)