చిత్రం : ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
అమ్మంటే మెరిసే మేఘం..మ్మ్..మ్మ్.మ్మ్
నాన్నంటే నీలాకాశం..మ్మ్..మ్మ్.మ్మ్
అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
నూరేళ్ళ ఆశాదీపం నువ్వే మా ఆరోప్రాణం
నువ్వే మా తారాదీపం పూజా పుష్పం
ఓ..అమ్మంటే మెరిసే మేఘం కురిసే వానా
నాన్నంటే నీలాకాశం తల వంచేనా
ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
శోకంలో పుట్టింది శ్లోకంగా రామ కథా
శోకంగా మిగిలింది కుమిలిన ఈ అమ్మ కథా
బంధాలే భస్మాలు విధే కదా వింత కథా
మమకారం మాతృత్వం నిన్నటి నీ ఆత్మ కథా
బ్రతుకంతా నిట్టూర్పై ఎడారైన బాధల్లో
కన్నీరై చల్లార్చే గతేలేని గాధల్లో
ఓ..ఓఓ ఓ..ఓఓ ఓ..ఓఓ
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
చింతల్లో సీమంతం శిలలోనే సంగీతం
శిథిలం నీ సంసారం చిగురేసే అనుబంధం
ఒక బ్రహ్మని కన్నావు అమ్మకి అమ్మైనావు
శివవిష్నువులిద్దరినీ చీకటిలో కన్నావు..ఆ.ఆ.ఆ..ఆ
త్రిమూర్తులకి జన్మవో తిరుగులేని అమ్మవో
ఏ బిడ్డని పెంచేవో ఏ ఒడ్డుకి చేరేవో
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
ఆ..ఆఆ ఆ..ఆఆ ఆ..ఆఆ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon