కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా పాట లిరిక్స్ | మనం (2014)

 చిత్రం : మనం (2014) 

సంగీతం : అనూప్ రూబెన్స్ 

సాహిత్యం : వనమాలి

గానం : అజిత్ సింగ్


టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి


ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా

నన్నే మార్చెనా నువ్వయ్యేలా

ఓ మనసును లాగే మాయలా వేసే ఓ వలా

నీ నవ్వులే నేడిలా

ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా

నీ ప్రేమే నే కోరుకున్నా..

నీలో ఉన్నా నీ తోడై ఉన్నా

నిన్నే నే ప్రేమించినా

 

ఓ కనులను తాకే ఓ కలా... ఓ...

 

హో ఇన్నాళ్లూ ఆనందం వెల్లువాయెనే

ఏమైందో ఈ నిమిషం దూరమాయెనే

వెన్నెలింక చీకటయ్యేనా

నవ్వులింక మాయమయ్యేనా

బాధలింక నీడలాగ నాతో సాగేనా..

నాలో రేగింది ఓ గాయమే..

దారే చూపేన ఈ కాలమే యేయేయేయే..

ఓ నీవే నేనా నీ మౌనం నేనా

నీ ఊసే ఈ గుండెలోనా..

నీతో లేనా ఆహా..

 

ఓ కనులను తాకె ఓ కలా... ఓ.. ఓ.. ఓ.. 

చంద ఓ చందమామ రావా

మా వెంటే రావా పైనే నువ్వు దాక్కున్నావా

వాన ఓ వెన్నెల వాన రావా

నువ్వైనా రావా మాతో నువు చిందేస్తావా

 

టీ టీటిటి టిటిటీటి టీ టీటిటి టిటిటీటి

టీ టీటిటి టిటిటీటీ టిటిటీ టీటి టిటిటీ టీటి టి

 


 

ఓ ఈ దూరం ఎందాక తీసుకెళ్లునో

ఈ మౌనం ఏ నాటికి వీడిపోవునో

బంధమింక ఆవిరయ్యేనా

పంతమింక ఊపిరయ్యేనా

నీటి మీద రాత లాగ ప్రేమే మారేనా..

ఇంక ఈ జీవితం ఎందుకో..

కంట కన్నీరు నింపేందుకో.. ఓ ఓ ఓ ఓ..

నీతో రానా నీ నీడై పోనా

నీ కోపం వెంటాడుతున్నా..

నీలో లేనా ఆహా..

Share This :



sentiment_satisfied Emoticon