చిత్రం : అంతం (1992)
సంగీతం : ఆర్.డి. బర్మన్, మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, కవితాకృష్ణమూర్తి
హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా
హో పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా
ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ...
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
హో ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ చెరిసగమైపోగా
హో..ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ..
పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ..
లలలాల.. లాలలాలా.. లలలాలా
అ.ఆ...లాలలాలలాలా లాలలాలలలాలా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon