చిత్రం : మూగనోము (1969)
సంగీతం : ఆర్. గోవర్ధన్
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు...
లోలోన ఏవో విరిసెలే వలపులు
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీలోని ఆశలన్నీ నా కోసమే...
నా పిలుపే నీలో వలపులై విరిసెలే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నీ చూపులో స్వర్గమే తొంగి చూసే..
నీ మాటలో మధువులే పొంగిపోయే
నాలోని ఆణువణువు నీదాయెలే..
బ్రతుకంతా నీకే అంకితం చేయనా..
నీలోని ఆశలన్నీ నా కోసమే..
నా పిలిపే నీలో వలపులై విరిసెలే..
లా ... లాలలా... లలలా... లా...
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
నీ రూపమే గుండెలో నిండిపోయే...
నా స్వప్నమే నేటితో పండిపోయే
ఉయ్యాల జంపాల ఊగేములే..
కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..
ఈ వేళ నాలో ఎందుకో ఆశలు..
లోలోన ఏవో విరిసెలే వలపులు
లా ...లా ...లా ... లాలలా
లాలలా... ఊ హూ హు.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon