నా నవ్వే దీపావళి పాట లిరిక్స్ | నాయకుడు (1987)

 చిత్రం : నాయకుడు (1987)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : రాజశ్రీ

గానం : జమునా రాణి 


నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం... నా వయసే

అతిమధురం... నా మనసే

నా నవ్వే నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి


కనని వినని అనుభవమే ఇదిరా

చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా

కనని వినని అనుభవమే ఇదిరా

చెలి రేయి పగలు నీకై ఉన్నదిరా

అందాలన్నీ పూచెను నేడే

ఆశల కోటా వెలిసెను నేడే

స్నేహం నాది దాహం నీది

కొసరే రేయీ నాదే నీది

ఆడి పాడి నువ్వే రా...


నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం... నా వయసే

అతిమధురం... నా మనసే

నా నవ్వే దీపావళి..ఈ..హోయ్

నా పలుకే గీతాంజలి


లలలాల లాల లాలలాలలాలా

లాలలా లాలలాలాలాల


కడలి అలలు నీ చెలి కోరికలే

నా కలల కథలు వణికెను గీతికలే

కడలి అలలు నీ చెలి కోరికలే

నా కలల కథలు వణికెను గీతికలే

వన్నెలు చిందే వెచ్చని ప్రాయం

పలికించేను అల్లరి పాఠం

పరువం నాలో రేగే వేళ

వయసే బంధం వేసే వేళ

ఆడి పాడి నువ్వే రా

 

నా నవ్వే.. నా నవ్వే దీపావళీ హోయ్

నా పలుకే గీతాంజలి

అరవిందం.. నా వయసే

అతిమధురం.. నా మనసే

నా నవ్వే దీపావళీ హోయ్

నా పలుకే గీతాంజలి 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)