ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము.
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీవున్న చోటికే వచ్చాము
మాలోన మరి ఇతర కోర్కెలు చేర్చకుము
నీలీలలందు మము నిండుగ ఉంచుము
పద పద్మముల సేవ పలుమారు చేసేము
మదినిన్ను నిలిపి నీ మంగళము పాడేము
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము
గోవులను మేపుచు పచ్చికను తినిపించి
గోపకులజుడు మా గోపాలుడు అనిపించి
చింతలన్ని మరచి చిత్తశుద్దిగా చేయ
అంతరంగిక సేవకు అడ్డు చెప్పకుమయ్యా
పరమందుకొని నేడు తిరిగిపోవగ లేము
చరణ సన్నిధి నీదు నిరతమ్ము కోరేము
ఏడేడు జన్మల బంధమును విడువము
ఈ జన్మ నీ స్మరణకు అంకితం అవనిమ్ము
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీ వున్న చోటికే వచ్చాము.
తెల్లవారక మునుపె ఎల్లరము లేచాము
మెల్లగ నీవున్న చోటికే వచ్చాము
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon