నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి పాట లిరిక్స్ | కార్తీక దీపం (1979)

 చిత్రం : కార్తీక దీపం (1979)

సంగీతం : సత్యం

సాహిత్యం : మైలవరపు గోపి

గానం : బాలు, జానకి


నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి

జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ


నీ కౌగిలిలో తల దాచి...


చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు

అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు

నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు


నీ కౌగిలిలో తల దాచి నీ చేతులలో కను మూసి

జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ


నీ కౌగిలిలో తల దాచి...


నింగి సాక్షి.. నేల సాక్షి.. నిను వలచిన నా మనసే సాక్షి

మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు

వేడుకలోను.. వేదనలోను... పాలూ తేనెగ ఉందాము


నీ కౌగిలిలో తల దాచి... నీ చేతులలో కను మూసి

జన్మ జన్మకు జతగా మసలే... వరమే నన్ను పొందనీ


నీ కౌగిలిలో తల దాచి... 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)