నా మనసిలా మనసిలా పాట లిరిక్స్ | అర్జున్ సురవరం (2019)

 చిత్రం : అర్జున్ సురవరం (2019)

సంగీతం : శామ్ సి.ఎస్.

సాహిత్యం : శ్రీమణి

గానం : చిన్మయి, అనురాగ్, శామ్


నా మనసిలా మనసిలా

ఓ మనసే కోరుకుందే

నీ మనసుకే మనసుకే

ఆ వరసే చెప్పమందే

ఏమో ఎలా చెప్పేయడం

ఆ తీపిమాటే నీతో

ఏమో ఎలా దాటేయడం

ఈ తగువే తకిథిమితోం


ఏదో తెలియనిదే

ఇన్నాళ్ళూ చూడనిదే

నేడే తెలిసినదే

మునుపెన్నడు లేనిది

మొదలవుతుందే


ఏదో జరిగినదే

బరువేదో పెరిగినదే

మౌనం విరిగినదే

పెదవే విప్పే వేళ ఇదే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకే నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకి నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


తియ్యగా తియ్య తియ్యగా

నీ తలపులు పంచవెలా

దాచుతూ ఏమార్చుతూ

నిన్ను నువ్వే దాస్తావెందుకలా


ఓ చినుకు కిరణం

కలగలిపే మెరుపే హరివిల్లే

సమయం వస్తే

ఆ రంగులు నీకే కనపడులే


మెల్లగా మెల్ల మెల్లగా

మన దారులు కలిసెనుగా

హాయిలో ఈ హాయిలో

ఆకాశాలే దాటేశాగా


ఇన్నాళ్లా నా ఒంటరితనమే

చెరిగేను నీ వల్లేనే

చూపులతో కాక పెదవులతో

చెప్పేయ్ ఈ మాటలనే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకి నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకి నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


కదలిక తొలి కదలిక

నా నిలకడ తలపుల్లో

సడలిక తొలి సడలిక

మది చుట్టూ బిగిసిన సంకెలలో


ఈ కలహం విరహం

తియ్యని తరహాకుండదు

విడుదలెలా

వినవా చెలియా కనిపించని

పెదవుల పలుకులిలా


మొదలిక తొలిసారిగా

నా ఎదలో అలజడులే

నిదురిక కరువవ్వగా

మరి కుదురే కుదురే చెదిరెనులే


ఇన్నేళ్ల కాలం మెరిసెనులే

నిన్నే కలిసిన వేళ

నా ఊహల విస్మయ విశ్వములో

వెన్నెల నీ చిరునవ్వే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకి నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


కన్నే కన్నే రెప్పే వేస్తే

నీ కలలోకి నడిచాలే

నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

నన్నే నేనే మరిచానే


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)