నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా సాంగ్ లిరిక్స్ సంతోషం (2002) తెలుగు సినిమా

Album:Santosham

Starring: Nagarjuna, Prabhu Deva, Shriya Saran, Gracy Singh
Music :R. P. Patnaik
Lyrics-Sirivennela Sitarama Sastry
Singers :Usha
Producer:Dr.K.L.Narayana
Director: K. Dasarath
Year:2002


నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా
తెంచుకో నీవు పంచుకో నీవు ఇంత చెలగాటమా
చెప్పుకో నీవు తప్పుకో నీవు నీకు ఇది న్యాయమా
పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా... పంతమా బంధమా...

నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా

ప్రేమా నీతో పరిచయమే ఎదో పాపమా
అమౄతమనుకొని నమ్మటమే ఒక శాపమా
నీ ఒడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా
పెదవులపై చిరునవ్వుల దగా
కనపడనీయవు నిప్పుల సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా
నీ ఆటెఏమిటో ఏనాటికి ఆపవు కదా
నీ పాటేమిటో ఏ జంటకి చూపవు కదా

Share This :sentiment_satisfied Emoticon