చిత్రం : గోల్కొండ హైస్కూల్ (2011)
సంగీతం : కళ్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : హేమచంద్ర
అడుగేస్తే అందే దూరంలో.. హలో
అదిగో ఆ తారతీరంలో.. చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలెననుకో
కనులింట ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో
అడుగేస్తే అందే దూరంలో.. హలో..హో..
కొండంత భారం కూడా తేలిగ్గ అనిపిస్తుంది
గుండెల్లో సందేహలేం లేకుంటే
గండాలో సుడిగుండాలో ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టుంటుందే
ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదాగా దూసుకెళిపో.. కడదాక ఆగననుకో
కలగన్న రేపునిపుడే కలుసుకో
ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే వద్దనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడ ఏదో ఆటల్లే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయంతే
నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని, రమ్మంటే రాదు కదా
ప్రతి బాట కొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే, తెలుసుకో!
ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon