కొట్టకుండ తిట్టకుండ వుంచుకుంటాను పిల్ల
చల్లంగ మెల్లంగ నీవుంటావా
చల్లంగ మెల్లంగ నేనుంటను గాని
నవ్వేటి నవ్వుమొగం ఎట్టపెట్టేది
నవ్వేటి నవ్వుముఖం నీవుబెట్టితే
చేతిలో దుడ్డుకర్ర చెండాడదా
చేతిలో దుడ్డుకర్ర చెండాడితే నీ
బండారం బయటికీ నే చెప్పనా
బండారం బయటికీ నీవుచెప్పితే మీ
అమ్మగారింటి కెళ్ళీ నే చెప్పనా
అమ్మగారింటికెళ్ళి నీవు చెప్పితే నే
కూటినీళ్ళ కాయకుండ దిగనూకనా
నీవు కూటినీళ్ళ కాయకుండ దిగనూకితే నే
స్టేషనుకి పోకుండ ఎగనూకనా
స్టేషనుకి పోకుండ ఎగనూకితే
బాయిలో గుంటలో నేనుపడనా
బాయిలో గుంటలో నీవుపడితే నే
వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించనా
వెట్టోణ్ణి పిలిపించి ఎత్తించితే నే
దెయ్యమై భూతమై నిన్నుపట్టనా
దెయ్యమై భూతమై నీవుపడితే నే
భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టనా
భూతగాణ్ణి పిలిపించి వదలగొట్టితే నే
తిరుపతికొండెక్కి తిరిగిచూస్తే
తిరుపతికొండెక్కి తిరిగి చూస్తే
చెన్నపురి రేవుకెల్లి చెక్కెయ్యనా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon