చిత్రం : అప్పుచేసి పప్పుకూడు (1959)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ.ఎమ్.రాజా, పి.లీల
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా చేయి చేయి
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
పెద్దవారి అనుమతింక లేదు లేదుగ
చేయి చేయి కలుపుటెల హాయి హాయిగ
ఉహూ చేయి చేయి
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
మగని మాటకెదురాడుట తగదు తగదుగ
నాతి చెంత విరహము నే తాళలేనుగ
అహా చేయి చేయి
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
వీలుకాని విరహమింక వలదు వలదుగ
దాసి మీద వలపు మీకు తగదు తగదుగ
అహా చేయి చేయి కలుపరావె హాయిహాయిగ
నదురు బెదురు మనకింక లేదులేదుగ
అహా చేయి చేయి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon