చిత్రం : శభాష్ రాముడు
రచన : సముద్రాల
సంగీతము : ఘంటసాల
గానం : సుశీల
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచె
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచె
స్వప్నాల లోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలోన దేవ గానాలు వింటూ
హాయిగ నీవింక నిదురించవోయి
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చింతా వంతా నీకేలనోయి
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించవోయి
రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon