అలుపన్నది ఉందా సాంగ్ లిరిక్స్ గాయం (1993) తెలుగు సినిమా



Album:Gaayam

Starring:Jagapathi Babu, Revathi
Music:shree
Lyrics-sirivennela
Singers :chitra
Producer:Yarllagada Surendra
Director:Ram Gopal Varma
Year:1993










అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు లల లల లలలలా
అలుపన్నది ఉందా ఎగిరే అలకు యదలోని లయకు


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)