ఎంత సొగసుగా ఉన్నావు పాట లిరిక్స్ | పుణ్యవతి (1967)

 చిత్రం : పుణ్యవతి (1967)

సంగీతం : ఘంటసాల

సాహిత్యం : సినారె

గానం : ఘంటసాల, సుశీల


ఎంత సొగసుగా ఉన్నావు

ఎలా ఒదిగి పోతున్నావు

కాదనక, ఔననక

కౌగిలిలో దాగున్నావు


ఎంత సొగసుగా ఉన్నావు అహాహా

ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ

కాదనక అహ ఔననక అహా

కౌగిలిలో దాగున్నావు 

ఎంత సొగసుగా ఉన్నావు


అందీ అందని హంసల నడకలు

ముందుకు రమ్మెనెను .. ఆఅ..

చిందీ చిందని చిరు చిరునవ్వులు

ఎందుకు పొమ్మనెను.. ఆఅ.అ..

అందీ అందని హంసల నడకలు

ముందుకు రమ్మెనెను

చిందీ చిందని చిరు చిరునవ్వులు

ఎందుకు పొమ్మనెను

నీ తనువే తాకగానే

నా మది ఝుమ్మనెను  

  

ఎంత సొగసుగా ఉన్నావు అహాహా

ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ

కాదనక అహ ఔననక అహా

కౌగిలిలో దాగున్నావు  

ఎంత సొగసుగా ఉన్నావు


తడిసీ తడియని నీలి కురులలో

కురిసెను ముత్యాలు..ఆఅ..

విరిసీ విరియని వాలు కనులలో

మెరిసేను నీలాలు...ఆఆ..ఆ..

తడిసీ తడియని నీలి కురులలో

కురిసెను ముత్యాలు

విరిసీ విరియని వాలు కనులలో

మెరిసేను నీలాలు,పులకించే పెదవులపై

పలికేను పగడాలు


 

 

ఎంత సొగసుగా ఉన్నావు అహాహా

ఎలా ఒదిగి పోతున్నావు ఆహాహ

కాదనక అహ ఔననక అహా

కౌగిలిలో దాగున్నావు 

ఎంత సొగసుగా ఉన్నావు


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)