కలిసే ప్రతి సంధ్యలో పాట లిరిక్స్ | ఆలాపన (1986)

 


చిత్రం : ఆలాపన (1986)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సినారె

గానం : బాలు, జానకి


కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో

కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి

నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో..


పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..

చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..

పొంగిపోదా సాగరాత్మ నింగికి.. ఆఆ.ఆ..

చేరుకోదా చంద్ర హృదయం నీటికి.. ఆఆ.ఆ..

సృష్టిలోన ఉంది ఈ బంధమే

అల్లుకుంది అంతటా అందమే

తొణికే బిడియం తొలగాలి

ఒణికే అధరం పిలవాలి

ఆ..ఆ...ఆ...


కలిసే ప్రతి సంధ్యలో...

పలికే ప్రతి అందెలో


మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..

గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..

మేనితోనే ఆగుతాయి ముద్రలు.. ఆఆ.ఆ..

గుండె దాకా సాగుతాయి ముద్దులు.. ఆఆ.ఆ..

ఇంత తీపి కొంతగా పంచుకో

వెన్నెలంత కళ్ళలో నింపుకో

బ్రతుకే జతగా పారాలి

పరువం తీరం చేరాలి

ఆ...ఆ...ఆ...ఆ


కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో

కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో

నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)