చిత్రం : అయ్యప్పస్వామి జన్మ రహస్యం (1987)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : పి.బి.శ్రీనివాస్
గానం : బాలు
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
తలపై దాల్చగనే ఇరుముడి దీక్షగొని
పులకింతలు గొనుచు మనసున నిన్ను గని
స్వామీ అయ్యప్పా శరణంటే చాలు
నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు
ఎరిమేలి చేరి ఆడని వారెవరూ
ఆనందమొంది పాడని వారెవరు
స్వామి తిందత్త తోం అయ్యప్ప తిందత్త తోం
అయ్యప్ప తిందత్తతోం స్వామి తిందత్త తోం
స్వామి తిందత్త తోం అయ్యప్ప తిందత్త తోం
అయ్యప్ప తిందత్తతోం స్వామి తిందత్త తోం
ఎరిమేలి చేరి ఆడని వారెవరూ
ఆనందమొంది పాడని వారెవరు
ఏనాడూ అచటా కనరానిది జాతీ
ఎవరికినీ అచట కలగనిదొక భీతి
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
విరిసేను అళుదా నదిగనెడు కళ్ళు
మురిసేను ముంచి నది నీట కాళ్ళు
నొగులెల్ల మరచి దిగులెల్ల విడిచీ
మ్రోగే పేరొకటె అయ్యప్పనెంచి
కరిమలను చేరీ సాగేటి వేళ
కడు చల్లగా గాలి వీఛేటి వేళ
ఎదలోన దివ్య జ్యోతి వెలిగేను
ఎక్కి దిగునపుడు తృప్తి కలిగేను
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
పంపలోన స్నానం భగవంతుని ధ్యానం
పంపలోన స్నానం భగవంతుని ధ్యానం
తొలగించి పాపం కలిగించును జ్ఞానం
నదిలోన కదలాడ దీపాల బారు
అది జూచు భాగ్యం నేత్రాల జేరు
శబరి గిరికి మొదటి సారి వచ్చేవారూ
శబరి పీఠమరసి శిరసు వంచేవారు
శరంగుత్తి యందు బాణాన్ని నాటీ
సాగేరు జనులెల్ల స్వామిని తలచి
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
కడలి తరగల రీతి తరలేటి జనులు
పడిన శ్రమలన్నీ మరిచేరు తృటిలో
పదునెనిమిదగు మెట్లపై స్వామి మహిమా
అదియెట్టి చిత్రాతి చిత్రమో కానీ
నేతి అభిషేకం గాంధాభిషేకం
ప్రీతిగొను శాస్తాకు వివిధాభిషేకం
బహుకోట్ల కనులకు అదె దేవలోకం
ప్రతి బ్రతుకు స్వామి దర్శనమంద సార్ధకం
స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా స్వామీ శరణం అయ్యప్పా
ఓం ఓం అయ్యప్పా
ఓం గురునాథా అయ్యప్పా
ఓం ఓం అయ్యప్పా
ఓం గురునాథా అయ్యప్పా
ఓం ఓం అయ్యప్పా
ఓం గురునాథా అయ్యప్పా
సాలుకొకసారి దేవునికి ఇచ్చే
బహువిధాభరణాల పెట్టె కొనితెచ్చే
ఆ దివ్య దృశ్యాన్ని తిలకించు భాగ్యం
అచట పొందిన వారి పుణ్యమే పుణ్యం
అలంకారమంత ఐన తరువాత
అర్పించు కర్పూర హారతుల చేత
మురిసేను మెరిసే ఆనంద మూర్తి
పెరిగేను విభవాన అయ్యప్ప కీర్తి
పెరిగేను విభవాన అయ్యప్ప కీర్తి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon