కాలమిలా ఆగిపోనీ పాట లిరిక్స్ | ఏది పాపం? ఏది పుణ్యం? (1979)

 చిత్రం : ఏది పాపం? ఏది పుణ్యం? (1979)

సంగీతం : సత్యం

సాహిత్యం : మైలవరపు గోపి

గానం : బాలు, సుశీల


కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి... ఈ నిమిషంలో... నీ ఒడిలోనే నిదురపోనీ

కాలమిలా ఆగిపోనీ...కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి ఈ నిమిషంలో... నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


తొలిసంజె మలి సంజెలేల... నా చెంత చెలి ఉన్న వేళ

తొలిసంజె మలి సంజెలేల... నా చెంత చెలి ఉన్న వేళ

చిరుగాలి సెలయేరులేల... నా మనిషి తోడున్న వేళ

అరుదైన వేళ... ఈ శుభవేళ...

బ్రతుకే వెన్నెల వేళా... వేళా.. వేళా..


కాలమిలా ఆగిపోనీ... కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ.. నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ

సిరిదివ్వెలో వెలుగులాగ... నీ చూపులో నిలిచిపోనీ

జేగంటలో రవళిలాగ... నీ ఊపిరై కలిసిపోనీ...

కలలే గానీ... కలతే లేని..లోకానకే చేరిపోనీ... చేరిపోనీ...


కాలమిలా ఆగిపోనీ... కలనిజమై సాగిపోనీ

అన్నీ మరచి...ఆ..ఆ..

ఈ నిమిషంలో...ఆ...ఆ..నీ ఒడిలోనే నిదురపోనీ...

కాలమిలా ఆగిపోనీ...


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)