పూలా వనమందు మల్లెమొగ్గ సుమించెనులే పాట లిరిక్స్ | స్వామి అయ్యప్ప (1975)

 చిత్రం : స్వామి అయ్యప్ప (1975)

సంగీతం : దేవరాజన్

సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం

గానం : 


పూలా వనమందు

మల్లెమొగ్గ సుమించెనులే

భువికే ఈనాడు

అమరమూర్తి లభించెనులే

పూలా వనమందు

మల్లెమొగ్గ సుమించెనులే

భువికే ఈనాడు

అమరమూర్తి లభించెనులే  

దైవం కరుణించే

ముద్దుల బాలుడు జనియించే

చల్లగ వర్ధిల్లా

మానవ జాతే దీవించే


పూలా వనమందు

మల్లెమొగ్గ సుమించెనులే

భువికే ఈనాడు

అమరమూర్తి లభించెనులే

అమరామూర్తి లభించెనులే


దివిని వెలిగెడి పూర్ణచంద్రుడే

ఇలను వెలిసెనని పాడవా

ఇలను వెలిసెనని పాడవా

వెలుగు నేత్రములు

కురియు కాంతులే

బువిని నిండెనని పాడవా

భువిని నిండెనని పాడవా

ప్రాణికోటికే నేడు పండుగా

భోగ భాగ్యములు నిండగా

భోగ భాగ్యములు నిండగా

సిరి సంపదలు భువిని మెండుగా

జనుల పుణ్యములు పండగా

జనుల పుణ్యములు పండగా


హాయి మీరగా సర్వ సౌఖ్యములు

అనుభవించరే ఓ చెలీ

అనుభవించరే ఓ చెలీ

దేవదేవుడే ముద్దు పాపడై

జన్మమెత్తెనే ఓ చెలీ

జన్మ మెత్తెనే ఓ చెలీ

జనులకైన మహరాజుకైన

ఆ దివ్య మూర్తి ఒక జ్యోతియే

ఆ దివ్య మూర్తి ఒక జ్యోతియే

సకల జీవులకు జ్ఞాన దాతయే

నిఖిల లోకముల నేతయే

నిఖిల లోకముల నేతయే


చంద్ర సూర్య సూర్య తేజముల

ఐక్యమైన విధమున

అందముల విందుజేయు పసివాడు

అందముల విందుజేయు పసివాడు

ఎల్లవారి ఎదలయందు సౌఖ్యములు నింపగా

వెలసిన మన్మథుడు చిన్నవాడు

వెలసిన మన్మథుడు చిన్నవాడు

లోకములు కొలిచెడి భోగముల తేలించేడి

ముద్దుబాలు కీర్తించరే అమ్మలారా

ముద్దుబాలు కీర్తించరే అమ్మలారా

వరపుత్రుడీవేనని వరములు ఈయమని

మాన్యుని పూజించరే ప్రియమారా

మాన్యుని పూజించరే ప్రియమారా

మాన్యుని పూజించరే ప్రియమారా


పూవులు పండ్లతొ మోహన

మూర్తికి పూజలు సేయండి

మన పుడమే ఆడగ స్వర్గము

పాడగ పరవశమందండీ

పూవులు పండ్లతొ మోహన

మూర్తికి పూజలు సేయండి

మన పుడమే ఆడగ స్వర్గము

పాడగ పరవశమందండీ


సొగసులు కొలిచెడి సంతతమిచ్చెడి

బాలుని కనరండి

ఈ లోకమునందలి శోకము తీర్చెడి

వీరుని కొలవండీ

వీరుని కొలవండీ

వీరుని కొలవండీ


విశ్వం బ్రోచు విధాత నీవని

విజ్ఞులు వర్ణించా

జన వాక్యం నిత్యం

అజేయుడవీవని

శౌర్యం స్తుతియించా

విశ్వం బ్రోచు విధాత నీవని

విజ్ఞులు వర్ణించా

జన వాక్యం నిత్యం

అజేయుడవని

శౌర్యం స్తుతియించా

బాధల పాలగు జీవుల పాలిట

సోదరుడనిపించు

నీ అనురాగంతో అసహాయులకు

వేదన మరపించూ

వేదన మరపించూ

వేదన మరపించూ


మానవుల రక్షించు మాన్యుడివే

ఈ ముత్యాల ఉయ్యాల శోభింతువా

సర్వలోకాలు దీవించే తండ్రి దివ్య రూపా వర్ధిల్లు

ఋషి పుంగవులను బ్రోవవో

మా దుర్భర వేదన దీర్చవో

జగతిని జ్యోతిగ వెలుగవో

మా ముద్దుల పాపా లాలిజో

లాలీజో లాలీజో లాలీజో

లాలీజో లాలీజో లాలీజో

లాలీజో లాలీజో లాలీజో 



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)