విన్నపాలు వినవలె అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: విన్నపాలు వినవలె

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics





రాగం: భూపాళం

విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ‖

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ‖

గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల వింతాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ‖

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు |
పంకజభవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను |
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ‖




Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)