విశ్వరూపమిదివో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: విశ్వరూపమిదివో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyricsవిశ్వరూపమిదివో విష్ణురూపమిదివో

శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ‖

కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు |
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ‖

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు |
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ‖

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు |
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము ‖
Share This :sentiment_satisfied Emoticon