Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: కామధేనువిదే
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
కామధేను విదే కల్పవృక్ష మిదే
ప్రామాణ్యము గల ప్రపన్నులకు ‖
హరినామజపమే ఆభరణంబులు
పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరు పాదసేవే భోగము
పరమంబెరిగిన ప్రపన్నులకు ‖
దేవుని ధ్యానము దివ్యాన్నంబులు
శ్రీవిభు భక్తే జీవనము |
ఆవిష్ణు కైంకర్యమే సంసారము
పావనులగు యీ ప్రపన్నులకు ‖
యేపున శ్రీవేంకటేశుడే సర్వము
దాపై యితని వందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు
పై పయి గెలిచిన ప్రపన్నులకు
comment 1 comments:
more_vertఈ కీర్తనలో నొక వైచిత్రి యున్నది. మొదటి రెండు చరణములలో తృతీయపాదమున యతినియమము పాటించలేదు. ఆచార్యులవారు విధిగ యతిప్రాసలను పాటింతురు కదా, ఇచ్చట కించిద్భిన్నముగ నున్నది.
11 July 2020 at 05:55చరణములను రెండేసి పాదములు కలవిగా గ్రహించినచో యతిమైత్రిని పాటించినట్లే యగుచున్నదని సమాధానపడ వచ్చును. అవును, ప్రతి చరణమునకు నాలుగుపాదములన్న నియతి ఐఛ్ఛికమే. కొన్ని కీర్తనములను వారు రెండేసి పాదములున్న చరణములతో కూర్చుట కాననగును.
sentiment_satisfied Emoticon