పొడగంటిమయ్య అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics






Album :: Annamacharya Keerthanalu



Song/ Keerthana :: పొడగంటిమయ్య



Get This Keerthana In English Script Click Here





Aarde Lyrics






రాగం:అట్టతాళం

పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము
నెడయకవయ్య కోనేటి రాయడా ‖

కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల
నేరిచి పెద్దలిచ్చిన నిధానమా |
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు
చేరువజిత్తములోని శ్రీనివాసుడా ‖

భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము
చేవదేర గాచినట్టి చింతామణీ |
కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము
తావై రక్షించేటి ధరణీధరా ‖

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా
లడచి రక్షించే దివ్యౌషధమా |
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము
గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా ‖








Share This :



sentiment_satisfied Emoticon