పుట్టు భోగులము మేము అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: పుట్టు భోగులము మేము

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics








పుట్టుభోగులము మేము భువి హరిదాసులము |
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ‖

పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ‖

గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు ‖
భామిని యాకె మగని ప్రాణధారి లెంక-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ‖

పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)