ఏమొకో చిగురుటధరమున అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఏమొకో చిగురుటధరమున


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics








ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను |
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ‖


కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన |
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు |
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు |
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా ‖

పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల |
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు |
వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు |
వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా ‖

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల |
వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు |
గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల |
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా ‖















Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)