ఎండ గాని నీడ గాని అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఎండ గాని నీడ గాని


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics
ఎండగాని నీడగాని యేమైనగాని
కొండల రాయడె మాకులదైవము ‖


తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని కానియేమైన |
కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ‖

చీమగాని దోమగాని చెలది యేమైనగాని
గాముగాని నాముగాని కానియేమైన |
పాములనిన్నిటి మ్రింగె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ‖

పిల్లిగాని నల్లిగాని పిన్న యెలుకైన గాని
కల్లగని నల్లిగాని కానియేమైన |
బల్లిదుడై వేంకటాద్రి పైనున్న యాతడి

మమ్మెల్ల కాలము నేలేటి యింటిదైవము ‖

Share This :sentiment_satisfied Emoticon