మేదిని జీవుల గావ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics






Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: మేదిని జీవుల గావ


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics








మేదిని జీవుల గావ మేలుకోవయ్యా |

నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా ‖

తగుగోపికల కన్నుదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుడ మేలుకోవయ్యా |
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా ‖

ఘనదురితపు గలువలు వికసించె
మినుకు శశినేత్రుడ మేలుకోవయ్యా |
పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ
జనక! యాశ్రితపారిజాత మేలుకోవయ్యా ‖

వరలక్ష్మీ కుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయుదోషరహిత మేలుకోవయ్యా |
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేడు మేలుకోవయ్యా ‖


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)