లాలి శ్రీ కృష్నయ్య అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde LyricsAlbum :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: లాలి శ్రీ కృష్నయ్య


Get This Keerthana In English Script Click HereAarde Lyricsలాలి శ్రీ క్రిష్ణయ్య నీల మేఘవర్ణ
నవ నీల మేఘవర్ణ
బాలగోపాలపాల పవ్వళింపరా

సింగారించిన మంచి బంగారు ఊయలలోన
మరి బంగారు ఊయలలోన
శంఖు చక్రథరస్వామి నిదురపోరా

లలితాంగి రుక్మిణీ లలనాయె కావలెనా
నీకు లలనాయె కావలెనా
పలుకు కోయిల సత్యభామయె కావలెనా

అందెలూ మువ్వలూ సందడిగ మ్రోయగను
అతి సందడిగ మ్రోయగను
అందముగాను నీవు పవ్వలింపరా

పగడాల పతకాలు కంఠనా ధరియించి
నీ కంఠనా ధరియించి
వంగేవు తొంగేవు నిదురపోరా

అలుకలు పోనెల అలవేలు మంగతో
శ్రీ అలవేలు మంగతో
కులుకుచు శయ్యనించు వెంకటేశ్వరుడాShare This :sentiment_satisfied Emoticon