కులుకుగ నడవరో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కులుకుగ నడవరో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics









రాగం: దేసాళం

కులుకక నడవరో కొమ్మలాలా |
జలజల రాలీని జాజులు మాయమ్మకు ‖

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా |
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు ‖

చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల |
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు ‖

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో |
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)