Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: మత్స్య కూర్మ వరాహ
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ ‖నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన |
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ ‖
కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా |
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన ‖
మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ |
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత ‖
comment 2 comments:
more_vertమచ్చ కాదు. మత్స్య
corrected amma
sentiment_satisfied Emoticon