ఒకపరి కొకపరి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఒకపరి కొకపరి


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics






రాగం: ఖరహరప్రియ
పెద తిరుమలాచర్యుల రచన

ఒకపరి కొకపరి కొయ్యారమై |
మొకమున కళలెల్ల మొలచినట్లుండె ‖

జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి |
జిగికొని నలువంక చిందగాను |
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన |
పొగరు వెన్నెల దిగబోసి నట్లుండె ‖

పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు |
కరగి ఇరుదెసల కారగాను |
కరిగమన విభుడు గనుక మోహమదము |
తొరిగి సామజసిరి తొలికినట్లుండె ‖

మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను |
తరచైన సొమ్ములు ధరియించగా |
మెరుగు బోడి అలమేలు మంగయు తాను |
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె ‖

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)