గరుడ గమన గరుడధ్వజ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: గరుడ గమన గరుడధ్వజ


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics

గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ‖


కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ‖

జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ‖

ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ‖

Share This :sentiment_satisfied Emoticon