మహినుద్యోగి కావలె అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: మహినుద్యోగి కావలె


Get This Keerthana In English Script Click HereAarde Lyrics

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు |
సహజి వలె నుండి ఏమి సాధించలెడు ‖


వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు |
చెదరి మరచితే సృష్టి చీకటౌ |
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు |
నిదురించితే కాలము నిమిషమై తోచు ‖

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ |
జాడతో నూరకుండితే జడుడౌను |
వోడక తపసియైతే వున్నతోన్నతుడౌ |
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను ‖

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు |
వెరవెరగక ఉండితే వీరిడియౌను |
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును |
పరగ సంశయించితే పాషండుడౌను ‖

Share This :sentiment_satisfied Emoticon