పవనాత్మజ ఓ ఘనుడా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics





Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: పవనాత్మజ ఓ ఘనుడా 


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics






ఓ పవనాత్మజ ఓ ఘనుడా
బాపు బాపనగా పరిగితిగా |

ఓ హనుమంతుడ ఉదయాచల ని-
ర్వాహక నిజ సర్వ ప్రబలా |
దేహము మోచిన తెగువకు నిటువలె
సాహస మిటువలె చాటితిగా ‖

ఓ రవి గ్రహణ ఓదనుజాంతక
మారులేక మతి మలసితిగా |
దారుణపు వినతా తనయాదులు
గారవింప నిటు కలిగితిగా ‖

ఓ దశముఖ హర ఓ వేంకటపతి-
పాదసరోరుహ పాలకుడా |
ఈ దేహముతో ఇన్నిలోకములు
నీదేహమెక్క నిలిచితిగా ‖
Share This :



sentiment_satisfied Emoticon