నెలమూడు శోభనాలు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నెలమూడు శోభనాలు

Get This Keerthana In English Script Click Here

Aarde Lyricsనెలమూడు శోభనాలు నీకు నతనికిదగు |
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ‖

రామనామమతనిది రామవు నీవైతేను |
చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు |
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ‖

హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు |
కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు |
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ‖

జలజ నాభుడతడు జలజముఖివి నీవు |
అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె |
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ‖
Share This :sentiment_satisfied Emoticon