దేవ యీ తగవు తీర్చవయ్యా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics

  


Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: దేవ యీ తగవు తీర్చవయ్యా


Get This Keerthana In English Script Click Here


Aarde Lyricsదేవ యీ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా ‖


తనువున బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేగుదురయ్యా ‖

పొడుగుచు మనమున బొడమిన యాసలు
అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు
పదపడి యేగతి బాసీనయ్యా ‖

లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను

గలిగితి వెక్కడి కలుషములయ్యా ‖Share This :sentiment_satisfied Emoticon